క్రైమ్/లీగల్

బిట్స్‌పిలాని విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, ఫిబ్రవరి 5: నగర శివారులోని ప్రతిష్టాత్మక బిట్స్ ఫిలాని కళాశాల్లో ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం జవహర్‌నగర్ పోలీసులకు హస్టల్ వార్డెన్ హరిదాసు ఫిర్యాదు చేయటంతో సిఐ చలపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ కథనం ప్రకారం చెన్నైకి చెందిన రాఘవన్ శాంతారాం బిట్స్ పిలాని ఇఇఇలో మూడో ఏడాది చదువుతున్నాడు. అతను శంకర్ భవన్ హస్టల్లో 217 గదిలో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి వరకూ అందరితో మామూలుగానే గడిపిన రాఘవన్ శాంతరాం సోమవారం తన గదిలో నుంచి బయటకు రాలేదు. అది గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. తలుపులు తెరిచి చూడటంతో బెడ్‌షీట్‌తో ప్యాన్‌కు ఉరి వేసుకున్నట్టు గమనించామని సిఐ చలపతి వివరించారు. రాఘవన్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాఘవన్ ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియరాలేదు.

చిత్రం..బిట్స్ పిలానిలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి రాఘవన్ శాంతరాం