క్రైమ్/లీగల్

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ అక్టోబర్ 12కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపకాలు చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురువారం విచారణ ప్రారంభించింది. వ్యవసాయ రంగంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఏపీ తరపున సాక్షిగా ఉన్న వ్యవసాయరంగ నిపుణుడు పీవీ సత్యనారాయణకు తెలంగాణ సీనియర్ న్యాయవాది రవీందర్‌రావు పలు ప్రశ్నలను సంధించారు. వ్యవసాయ వాతావరణ జోన్లు మొదట ఏడుగా ఉండేవని, తర్వాత కృష్ణా, గోదావరి జోన్లనుంచి గోదావరి జోన్‌ను, ఉత్తర, దక్షిణ తెలంగాణ జోన్లనుంచి మధ్య తెలంగాణ జోన్ కొత్తగా ఏర్పాటై మొత్తం తొమ్మిది వ్యవసాయ-వాతావరణ జోన్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటంలో రూపొందించామని ఏపీ సాక్షి సమాధానమిచ్చారు. విచారణ శుక్రవారం కూడా కొనసాగుతుంది.