క్రైమ్/లీగల్

దొంగతనం కేసులో ముగ్గురు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండమల్లేపల్లి, ఆగస్టు 4: దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో రిమాండ్ చేసినట్లు కొండమల్లేపల్లి ఎస్ ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెల 21 వ తేదీన మండల పరిధి లోని కొలిముంతల్‌పహాడ్ గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన కొత్తబావి లో కొత్తగొర్ల గోపమ్మ ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు దొంగిలించారు. ఈ ఘటనపై గోపమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ ఐ శంకర్‌రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో నేరెడుగొమ్ము మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన వాంకుడావత్ మహేందర్ శుక్రవారం దొంగిలించిన బంగారాన్ని కొండమల్లేపల్లిలో విక్రయించేందుకు రాగా ఖచ్చితమైన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినట్లు చెప్పారు. దొంగిలించిన సొమ్మును తన మిత్రుడైన బాణావత్ చందు సాయంతో దేవరకొండ పట్టణానికి చెందిన మాండన్ కిషన్‌సింగ్‌కు విక్రయించామని నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. తాను కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి రుణాన్ని తీసుకున్నట్లు కిషన్‌సింగ్ అంగీకరించడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి చోరీకి గురైన 4 తులాల బంగారు, 4 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్ ఐ శంకర్‌రెడ్డి చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏ ఎస్ ఐ జయానందం, పీసీలు మంగ్యానాయక్, గణేశ్, మల్లయ్య, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.