క్రైమ్/లీగల్

కల్తీ మద్యం తయారీ స్థావరంపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 4: జిల్లాలోని నేరడిగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో యధేచ్ఛగా కల్తీ మద్యం తయారీ చేస్తూ మహారాష్టత్రో పాటు ఉమ్మడి జిల్లాల్లో అక్రమ మద్యం దందా కొనసాగిస్తున్న ముఠా రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసుల దాడిలో ప్రాణహానికి దోహదంచేసే విష పూరిత రసాయనాలు, ప్రభుత్వం నిషేదించిన దేశీదారు మద్యం నిల్వలు పట్టుబడ్డాయి. వివరాల్లోకి వెళితే నేరడిగొండ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జాతీయ రహదారికి పక్కనేగల ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రెండేళ్ళుగా ఎక్సైజ్ సిబ్బంది కనుసన్నల్లోనే అక్రమ మద్యం తయారీ గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. ఈ సమాచారం పోలీసులకు అందడంతో శనివారం ఉట్నూరు డీఎస్పీ వెంకటేశ్ అధ్వర్యంలో ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్ పోలీసులు మూకుమ్మడిగా ఫంక్షన్ హాల్‌పై మెరుపుదాడి నిర్వహించగా, కళ్లుబైర్లుకమ్మే రీతిలో మద్యం తయారీ స్థావరం బయటపడింది. డ్రమ్ముల్లో సగం నీళ్ళుకలిపి సగం వంతు మహారాష్ట్ర దేశీదారు, చీప్‌లిక్కర్ మిశ్రమాలను కలిపి బ్రాండెడ్ మద్యం సీసాల్లో నింపుతూ గుర్తుపట్టని విధంగా సీల్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూరు, భైంసా డివిజన్‌లతోపాటు మహారాష్ట్ర సరిహద్దులోని కిన్వట్, నాందెడ్, బోకర్ ప్రాంతాల్లో అక్రమ మద్యం దందా కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారుల విచారణలో బయటపడింది. సంఘటనా స్థలం వద్ద 2,200 మద్యం సీసాలు, 1222 మద్యం బాటిళ్ళు, మరికొన్ని ఖాళీ సీసాలు, మూతలు, రసాయనాలు, తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, 200 లీటర్ల దేశీదారు పట్టుకున్నారు. ఓ రసాయన పౌడర్ చిటికెడు డ్రమ్ములో కలిపితే మద్యం రంగులోకి మారడమే గాక హానికల్గించే మత్తు పదార్థంగా ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. రెండేళ్ళుగా ఈ దందా కొనసాగుతోందని, ఎక్సైజ్ అధికారులకు తెలిసినా రాజకీయ జోక్యంతోనే వ్యవహారం కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. మద్యం తయారీ స్థావరం వద్ద షిప్ట్, ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా, నిందితుడు సృజన్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు. దాడిలో సీఐ సతీష్, నేరడిగొండ ఎస్సై హరిశేఖర్, గుడిహత్నూర్ ఎస్సై రామస్వామి గౌడ్, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ రాజవౌళి తదితరులు పాల్గొన్నారు.