క్రైమ్/లీగల్

భార్యను కడతేర్చబోయిన కసాయి భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, ఆగస్టు 4: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాలని చూసాడు ఓ కసాయి భర్త. అందుకు నేపాల్ నుంచి నాటు తుపాకీ తీసు కువచ్చాడు. ఆ తుపాకీతో భార్యను కాల్చిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గల బుడిగ జంగాల కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామకృష్ణకాలనీలో గల బుడిగ జంగాల కాలనీలో నివసిస్తున్న ఊబిది కనకయ్యకు అదే గ్రామానికి చెందిన స్వప్న ప్రేమించుకుని గత పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, ప్రస్తుతం స్వప్న మూడు నెలల గర్భవతి. కనకయ్య ఆటో నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తుండగా, ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండటంతో బతుకుదెరువు కోసం నేపాల్‌లోని ఖాట్మండ్‌కు వెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సామాగ్రి, కవర్లు, పేపర్లు ఏరుకుంటూ జీవిస్తుండగా, అదే సమయంలో కనుకయ్యకు ఓ సంచి దొరకగా అందులో నాటు తుపాకి ఉండగా, దానిని జాగ్రత్తగా దాచుకున్నాడు. జూలై ఒకటిన తన సోదరి వివాహం ఉండడంతో జూన్ మాసంలోనే కనకయ్య స్వగ్రామానికి చేరుకున్నాడు. రామకృష్ణకాలనీలోని ఓ వెల్డింగ్ షాపులో ప్రస్తుతం కనుకయ్య పనిచేస్తున్నాడు. శుక్రవారం అత్తగారి ఇంటి వద్దనే ఉన్న కనుకయ్య దంపతులు సాయంత్రం తమ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో తుపాకీనీ తీసుకున్న కనుకయ్య తన భార్య స్వప్నపై కాల్పులు జరపగా, పెద్దశబ్దం వచ్చింది. వెంటనే చుట్టు ప్రక్కల వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. బుల్లెట్ ఆమె తొడ భాగంలో చీల్చుకుంటూ వెళ్లగా తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే ఆమెను స్థానికులు 108 వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డితో ఎసీపీ ఉషారాణీ, సీఐ కరుణాకర్ రావు, ఎస్సై నరేశ్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని వివరాలను సేకరించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను చల్మడ ఆనందరావు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శనివారం కాల్పులు జరిపిన గదిని, పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కనకయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాజీవ్ రహదారిపై ఉన్న డ్రైనేజ్‌లో నాలుగు బులెట్లు దొరికాయి. ఈ మేరకు కనకయ్య, తల్లిదండ్రులపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం, అక్రమంగా ఆయుధాలను కలిగియున్న కేసులను నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు.