క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లాపూర్, ఆగస్టు 4: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ వీఆర్వో మహ్మద్ రఫీ నడికుడ గ్రామానికి చెందిన రైతు గడ్డం మహిపాల్‌రెడ్డి నుంచి పట్టాదారుపాసుపుస్తకం విరాసత్ చేయడం కోసం రూ. 20వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ శనివారం వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం రాష్ట్రప్రభుత్వం భూ సమస్యలు తీర్చేందుకు భూ ప్రక్షాళన ప్రవేశపెట్టగా, వీఆర్వో రఫీ అందుకు విరుద్ధంగా మహిపాల్‌రెడ్డి అనే రైతు తల్లి పేరున ఉన్న రెండు ఎకరాల 38గుంటల భూమిని తన పేరులోకి మార్చేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత రెండునెలల నుంచి తన తల్లి నుంచి సంక్రమించే భూమికి నీకెందుకు లంచం ఇవ్వాలని వీఆర్వోను నిలదీసినా వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించానని బాధితుడి తెలిపాడు. దీంతో శనివారం మహిపాల్‌రెడ్డి తన ఇంటికి వీఆర్వో రఫీని పిలిపించి రూ. 20వేలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల దాడితో మండలంలోని అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైం ది. రైతు నుంచి లంచం తీసుకుంటూ పడిబడిన వీఆర్వో రఫీని అరెస్టు చేశామని ఏసీబీ కోర్టులో సోమవారం హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ కిరణ్ వెల్లడించారు.