క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరిట చీటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 4: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన కేసులో ముగ్గురిని భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం, భీమిలి, చిట్టివలసకు చెందిన గనివాడ చిన్నకృష్ణ (34), స్నేహితుడైన దుర్గారావు ప్రభుత్వ ఉద్యోగం కోసం సాగిస్తున్న వేటలో భాగంగా పాయకాపురానికి చెందిన సంజయ్ ప్రదీప్, అతని స్నేహితులైన పరగాటి అనిల్, పరగాటి సునీల్ మాయమాటలకు మోసపోయారు. ఉద్యోగాల కోసం 2017 మేలో సుమారు నాలుగున్నర లక్షలు నగదు, కొంత బ్యాంకు ద్వారా, కొంత చేతికి ముట్టచెప్పారు. నగదు తీసుకున్న ముగ్గురూ రోజులు గడిచినా ఉద్యోగాలు ఇప్పించకపోగా మోసం చేసి చేతులెత్తేశారు. ఇలా ముగ్గురూ సుమారు మరో 14మందిని ఉద్యోగాల పేరుతో మోసగించి డబ్బు గుంజారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులైన సంజయ్, అనిల్, సునీల్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నియామక ధ్రువపత్రాలు, అభ్యర్థులకు సంబంధించిన మార్కుల లిస్టులను స్వాధీనం చేసుకున్నారు.