క్రైమ్/లీగల్

కరక్కాయల స్కాం నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 4: ఇంట్లో కుర్చుని నెలకు 15నుంచి 20వేల రూపాయలు సంపాదించవచ్చు.. ఇల్లు కదల కుండా వేల రూపాయలు సంపాదించాలంటే మాసంస్థలో సభ్యులుగా చేరాలని ప్రకటనలు ప్రచారం చేసుకుని అనంతరం బోర్డు తిప్పెస్తున్నావారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు చెప్పిన ప్రజలలో మార్పు రావడం లేదు. వేయ్యి రూపాయలు చేల్లించి మాసంస్థలో చేరి ఒక కేజి కరక్కాయలు తీసుకుని వెళ్లి వాటిని పొడిచేసి ఇస్తే1300 రూపాలు ఇస్తామని ప్రకటనలు గప్పించి సుమారు 8కోట్ల రూపాయలు మోసం చేసి పారిపోయిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిథిలోని కేపీహెచ్‌బీ కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన కరక్కాయల కేసును సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సస్ వింగ్ పోలీసులు చేధించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయడంతోపాటు 40లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా అంబాపురంకు చెందిన ముప్పల మల్లికార్జున్ (36) ఇదే ప్రాంతానికి చేందిన మటూరి దేవారాజ్ అనిల్ కుమార్ (35) పెనుగొండ జగన్మ్‌హన్ రావు(36) గుండపనేని సురేందర్ (36) తినాలూరి మహేష్ (36) నోటి చిరంజీవి రెడ్డి (45)లు కలసి సాఫ్ట్ ఇంటిగ్రేటే మల్టీ టూల్స్ ప్రయివేటు లిమిటేడ్ (ఎస్‌ఐఎంటీ) పెయిన్ మిత్రా పేర్లతో సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ సైట్‌లను సృష్టించారు. ముఖ్యంగా మహిళను లక్ష్యంగా చేసుకుని చేసుకుని ప్రకటలు ఇవ్వడం జరిగింది. పెయిన్ మిత్రాలో 424 సభ్యులు ఉండగా వీరి నుంచి 85లక్షల 29వేల వసూలు చేసి లాభం రూపంలో 49లక్షల 15వేల రూపాయలను సభ్యులకు చేల్లించారని ఇందులో 45లక్షల 51వేల 800 రూపాలు మోసం జరిగినట్లు సీపీ వెల్లడించారు. కరక్కాయ స్కామ్‌లో రెండు కోట్ల 39లక్షల 45వేల 850 రూపాయలు మోసానికి పాల్పడినట్లు సజ్జనార్ తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చు అనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సంస్థల వివరాలను పోలీసులకు తెలియ చేయాలని సజ్జనార్ కోరారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర వహించిన కేపీహెచ్‌బీ డీఐ గోపినాథ్‌ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఈవో డబ్ల్యూ డీసీపీ విజయ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ కుక్కట్‌పల్లి ఏసీపీ భుజంగరావుసిబ్బంది పాల్గొన్నారు.