క్రైమ్/లీగల్

అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దతిప్పసముద్రం, ఆగస్టు 5: వ్యవసాయాన్ని నమ్ముకున్న ఆ రైతుకు పంటలు వేయడానికి చేసిన అప్పులు పెనుభారం కావడంతో వాటిని తీర్చే దారి కనిపించక పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా, పెద్దతిప్పసముద్రం, తుమ్మరకుంట పంచాయతీ, నవాబుకోటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నవాబుకోటకు చెందిన దళిత రైతు గుమ్మసముద్రం గంగులప్ప (65) మరో ఐదు మంది రైతులతో కలిసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు వేయించుకుని పంటలు సాగు చేస్తున్నారు. తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశాడు. పెద్ద కుమారుడు, కోడలు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. మరో కుమారుడు తన కుటుంబంతోకలిసి అదే గ్రామంలో జీవిస్తున్నారు. కాగా గంగులప్ప తన భార్య సుబ్బమ్మలతో కలిసి జీవిస్తూ పెద్ద కుమారుడు కూతురు, కొడుకుని తన వద్దే ఉంచుకుని పోషిస్తున్నాడు. గత ఏడాదిగా పంటల కోసం తెలిసిన వారి వద్ద దాదాపు లక్ష 10వేలు వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని గంగులప్ప ఆదివారం తన వ్యవసాయ భూమిలోనే పురుగుల మందు తాగి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగులప్పను స్థానిక రైతులు గుర్తించి 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే గంగులప్ప మృతి చెందినట్లు గుర్తించారు.