క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు టోకరా వేసిన ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఆగస్టు 5: నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ యువకులను మోసగించి, వారి నుండి 95లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠాను ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసు విషయమై ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ హైమారావు వివరాలు తెలియచేస్తూ విజయవాడకు చెందిన రేఖాశ్రీ, సోదరి ముప్పాళ్ల భవ్యశ్రీ మరికొందరు కలసి విజయవాడ కేంద్రం ఏర్పాటు చేసుకొని, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఈ నేపధ్యంలో ముండ్లమూరు మండలం మారెళ్ళకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాసులు ఏజెంటుగా ఉండి అద్దంకి ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ఆయన మాయమాటలు నమ్మిన గుదిబండ వీరాంజనేయరెడ్డి ఉద్యోగం కోసం లక్షల రూపాయలు చెల్లించి, సంవత్సర కాలంగా వారిచుట్టూ తిరుగుతున్నాడు. వీరాంజనేయరెడ్డికి ఉద్యోగం వచ్చిందంటూ నకిలీ ఐడి కార్డు, ఆనకిలీ జాబ్‌కన్ఫర్మేషన్ లెటరు కూడా ఇచ్చారు. జాయినింగ్ లెటరు ఇంకా రాలేదు వస్తుందంటూ కాలంవెళ్ళబుచ్చుతున్న వీరిపై అనుమానం వచ్చి పూర్తి ఆరాతీసిన బాధితుడు ఇదంతా గోల్‌మాల్ వ్యవహారంలా అనిపించడంతో అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ హైమారావు, ఎస్సై సుబ్బరాజు ఆధ్వర్యంలో తీగలాగితే డొంకంతా కదిలింది. విజయవాడలోని నిందితులను, అదేవిధంగా గుంటూరు జిల్లాలోని మరికొందరు నిందితులను తీసుకువచ్చి పూర్తిస్ధాయిలో విచారణ జరిపారు. మొత్తం 31మంది నుండి 95లక్షలు వసూలుచేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని, మొత్తం నందితులు 13మంది కాగా వారిలో 8మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని సిఐ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఆన్‌లైన్ అప్లికేషన్, వ్రాతపరీక్ష, ఇంటర్యూ ఉంటాయని, అలాంటివేమి లేకుండా నేరుగా ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసగాళ్లు నమ్మించేందుకు ప్రయత్నం చేస్తుంటారని, అలాంటి వారి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియచేయాలని, యువకులు కూడా ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈకేసులో ముద్దాయిలను అరెస్టు చేసేందుకు తమ ఎస్సై సుబ్బరాజు, సిబ్బంది కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, వారిని అభినందిస్తూ వారికి రివార్డులు అందచేశారు.