క్రైమ్/లీగల్

ఆశ్రమ బాలికలపై అఘాయత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియోరియా, లక్నో, ఆగస్టు 6: బిహార్‌లోని ముజఫర్ సంఘటన మరువక ముందే అలాంటి సంఘటనే ఈసారి యూపీలో వెలుగులోకి వచ్చింది. ఆశ్రమంలోని 24 మంది బాలికలపై నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ఆశ్రమంపై అధికారులు దాడులు నిర్వహించారు. యూపీలోని డియోరియాలోని స్టేషన్ రోడ్‌లో మా వింధ్యావాసిని మహిళా ప్రకిషాన్, ఈవమ్ సమాజ్ సేవా సంస్థాన్ పేరుతో నిర్వహిస్తున్న సంస్థపై పోలీసులు దాడి చేశారు. ఇందులో నివసిస్తున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అందులోని 24 మంది బాలికలను రక్షించారు. వాస్తవానికి ఈ ఆశ్రమంలో 42 మంది ఉన్నట్టు రికార్డులు చెబుతుండగా, అందు 18 మంది ఇప్పటికే కనిపించకుండా పోయారు. ఈ కేసుకు సంబంధించి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న దంపతులు, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.