క్రైమ్/లీగల్

ప్రత్యేక హక్కుల చట్టం ఆర్టికల్ 35-ఎపై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్మూకాశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పిస్తూ అమలవుతున్న ఆర్టికల్ 35-ఎ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. అయితే డివై చంద్రచూడ్ హాజరుకాకపోవడంతో విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలనే విషయంపై కూడా విచారణ జరపాల్సి ఉందన్నారు. 35-ఎ అధికరణ రాజ్యాంగం ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందా అనే విషయం కూడా పరిశీలిస్తుందని చీఫ్ జస్టిస్ మిశ్రా తెలిపారు. 1954లో రాష్టప్రతి ఉత్తర్వుల ద్వారా జమ్మూకాశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తూ 35-ఎ అధికరణను ప్రవేశపెట్టారు.
కాశ్మీర్‌లో రెండోరోజూ కొనసాగిన బంద్
కాశ్మీర్‌లో అమలవుతున్న 35-ఎ అధికరణను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేయడాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపుమేరకు కాశ్మీర్, చెన్ లోయలో రెండోరోజూ కూడా బంద్ కొనసాగింది. సయ్యద్ ల్రీ జిలాని, మిర్వాజ్ ఉమర్ ఫార్, మహ్మద్ యాసిన్ మాలిక్ తదితరులతో కూడిన జాయింట్ రెసిస్టెన్స్ లీడర్ షిప్ (జెఆర్‌ఎల్) ఇచ్చిన పిలుపుమేరకు కాశ్మీర్‌లో రెండోరోజైన సోమవారం కూడా బంద్ జరిగింది. ఈ బంద్‌కు వ్యాపారులు, రవాణా విభాగాలు తదితరుల నుంచి మద్దతు లభించింది. రాష్టబ్రార్ అసోసియేషన్ కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది. గత రెండురోజులుగా రాష్ట్రంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ అకాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీల ఆధ్వర్యంలో సైతం పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంనించింది. కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో భద్రతా దళాలలను మోహరించారు. కాగా, బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు ప్రకటించారు.