క్రైమ్/లీగల్

ఆ ఇద్దరు క్రైస్తవ మత గురువులు పోలీసులకు లొంగిపోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కేరళ చర్చి లైంగిక కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మత గురువులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగాలను ఈ ఇద్దరు నిందితులు ఎదుర్కొంటున్నారు. వీరు తప్పనిసరిగా ఈ నెల 13లోగా పోలీసులకు లొంగిపోవాలని జస్టిస్ సిక్రి, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితులు లొంగిపోయిన అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించవచ్చని ధర్మాసనం సూచించింది. తనపై చర్చికి చెందిన నలుగురు మత గురువులు పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారని అదే చర్చికి చెందిన వివాహిత (34) ఫిర్యాదు చేయడంతో గత జూలై 2న కేరళ క్రైం బ్రాంచి పోలీసులు కేసు నమోదు చేశారు. మలంకర సిరియన్ ఆర్థొడాక్స్ చర్చికి చెందిన నలుగురు మత గురువులపై మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిందితుల్లో ఇద్దరు పోలీసులు లొంగిపోయారు. కానీ మరో ఇద్దరు నిందితులు ఫాదర్ సోనీ వర్గీస్, ఫాదర్ జైసే కే జార్జ్ తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వీరి అభ్యర్థనను హైకోర్టు గత జూలై 11న తిరస్కరించింది. ఇలావుండగా సుప్రీం కోర్టులో సోమవారం ఈ కేసు హియరింగ్‌కు రాగా సీనియర్ అడ్వొకేట్ వి.గిరి ఈ కేసులో కోర్టు రక్షణ కల్పించిన కారణంగా నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదని పోలీసులకు ఈ కేసుకు సంబంధించిన నివేదికను సమర్పించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ధర్మాసనం వారికి రక్షణ కల్పించిన మాట వాస్తవమే అయినప్పటికీ దాని అర్థం వారిని విచారించకూడదని కాదని పేర్కొందని ఇద్దరు నిందితుల తరపు న్యాయవాది ఆర్. బసంత్ స్పష్టం చేశారు. దర్యాప్తునకు నిందితులిద్దరూ సహకరించే పక్షంలో వారి వాగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు సూచించిందన్నారు. కాగా ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఇంటర్నెట్‌లో బాధితురాలిపై అనేక ఆరోపణలతో కూడిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఈ ఆరోపణలను ప్రస్తావించిన అడ్వొకేట్ బసంత్‌కు సమాధానం ఇస్తూ ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయిన బాధితురాలిని మరింత బాధపెట్టడం దారుణమని అడ్వొకేట్ గిరి అన్నారు.