క్రైమ్/లీగల్

విజయలక్ష్మిపై కాంగ్రెస్ నేత గండ్ర ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6; తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొమురెల్లి విజయలక్ష్మీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడని విజయలక్ష్మీ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ప్రజల్లో తనకు ఉన్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే ప్రత్యర్థులు ఓ మహిళతో ఇటువంటి ఆరోపణలు చేయించినట్లు గండ్ర తెలిపారు. ఇలాఉండగా గండ్ర ఫిర్యాదుతో విజయలక్ష్మీరెడ్డిపై 384, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.