క్రైమ్/లీగల్

పడగ విప్పిన రౌడీయిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 9: సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో రోజు రోజుకు రౌడియిజం మితిమీరిపోతోంది. అనతి కాలంలోనే హత్యలు... అరాచకాలు పెరిగిపోతుండటంతో ఇక్కడ అలజడి మళ్లీ మొదలయ్యింది. నేర సంచనాలకు నిలయమైన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదన్న విమర్శలు తరుచూ జరిగే సంఘటనలను బట్టి చూస్తే రుజువవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్ నగర్‌లో బుధవారం రాత్రి నడిరోడ్డుపై ధనాల శివ శంకర్ అలియాస్ చిన్నా (28)ను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఇక్కడ సంచలనం అయ్యింది. నడిరోడ్డుపై సినీ ఫక్కీలో అందరూ చూస్తుండగానే శివ శంకర్ హత్య జరగడం భయాందోళనకు గురి చేసింది. గోదావరిఖని వన్‌టౌన్ సిఐ వాసుదేవ రావు తెలిపిన వివరాల ప్రకారం, గోదావరిఖని లెనిన్ నగర్‌కు చెందిన శివ శంకర్ గత కొంత కాలంగా కొత్తగూడెంలోని ఇల్లందులో నివాసముంటున్నాడు. ఈ మధ్యనే చిన్నా మిత్రుడు, గోదావరిఖనికి చెందిన కిరణ్ మృతి చెందగా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం శివ శంకర్ పుట్టిన రోజు కాగా మిత్రులు కొందరు అతనికి శుభాకాంక్షలు తెలిపి పార్టీ చేసుకునేందుకు బయటకు వచ్చారని, ఈ క్రమంలో కొందరు ఒక్కసారిగా శివ శంకర్‌పై కత్తులో దాడి చేయగా పారి పోయే ప్రయత్నం చేయగా వెంబడించి అతన్ని పట్టుకొని గొంతు కోసి కడుపులో సైతం కత్తిలో పొడిచారు. కాగా, ఈ హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తున్నాయి. అయితే పుట్టిన రోజు నాడే అతన్ని పథకం ప్రకారం మట్టుబెట్టడం స్థానికంగా చర్చానీయాంశం అయ్యింది. కాగా శివ శంకర్ పలు కేసులో నిందితునిగా ఉండటంతో అతనిపై రౌడీ షీట్ ఉంది. సంఘటన స్థలానికి గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు చేరుకొని పరిశీలించారు. కాగా సంఘటన స్థలంలో కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నాకు భార్య, పిల్లలున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు?
రౌడీ షీటర్ శివ శంకర్ హత్య కేసులో నిందితులు గురువారం రోజున గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
మూడు నెలల్లో ఇద్దరు సోదరుల హత్య
హనుమాన్‌నగర్‌కు చెందిన ధనాల రామారావుకు ధనాల చంద్రశేకర్, ధనాల శివ శంకర్ అలియాస్ చిన్న, ధనాల దుర్గా రావు అలియాస్ చంటి అనే ముగ్గురు కుమారులున్నారు.
వీరిలో ధనాల దుర్గా రావును గత మూడు నెలల క్రితం అతని అన్న ధనాల చంద్రశేకర్ హత్య చేశాడు. ప్రస్తుతం శివ శంకర్ హత్యతో ఒకే ఇంట్లో మూడు నెలల వ్యవధిలో ఇద్దరు సోదరుల హత్య జరిగింది.

హత్యకు గురైన రౌడీ షీటర్ శివ శంకర్ (ఫైల్)