క్రైమ్/లీగల్

పేట కలెక్టరేట్ నిర్మాణంపై వివాదానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 9: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణ స్థల వివాదానికి తెరపడింది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రైవేట్ స్థలంలో కలెక్టరేట్ భవన నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హై కోర్టు కొట్టివేసింది. దీంతో గత పది మాసాలుగా కోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా సూర్యాపేట జిల్లా అవతరించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంపై రాజకీయంగా దుమారం రేగింది. జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికి చివ్వెంల మండలపరిధిలోని కుడకుడ శివారులో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిని కొనుగోలు చేసి ఆస్థలంలోనే కలెక్టరేట్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ప్రభుత్వ స్థలా లు అందుబాటులో ఉన్నా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన అనుయులకు కోట్లాది రూపాయల లబ్ధిచేకూర్చేందుకే ప్రైవేట్ స్థలాన్ని ఎంపిక చేయించారని విపక్షాలు పెద్దఎత్తున ఆరోపణలకు దిగాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు ఒక్కటై కలెక్టరేట్ స్థలాన్ని మార్పు చేయాలని అప్పట్లో ఆందోళనలు సైతం చేపట్టాయి.
స్థల ఎంపిక విషయంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందంటూ మంత్రిపై విమర్శలు గుప్పించాయి. ఈ అంశంపై వివిధ పార్టీలకు చెందిన రాష్టస్థ్రాయి నేతలు స్పందించడంతో రాష్టవ్య్రాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ స్థలంలో కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాల్ చేస్తూ జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు.
గత ఆరు నెలలుగా కోర్టులో ఈకేసు విచారణ జరుగుతుండగా గురువారం కాంగ్రెస్ నేతల పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఆపార్టీ నేతలకు చుక్కెదురైంది. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనం కోసమే ప్రభుత్వ స్థలం అందుబాటు లో ఉన్నా ప్రైవేటు స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించగా ప్రభుత్వం తరుపున న్యాయవాది ప్రజాప్రయోజనాల కోసమే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని పిటిషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడైనందునే రాజకీయ దురుద్ధేశంతో ఆరోపణలు చేస్తున్నాడని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించి పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం..సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు