క్రైమ్/లీగల్

నేరగాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజకీయాధికారం, వ్యవస్థల్లోకి, ఎన్నికల రాజకీయాల్లో నేరగాళ్లు ప్రవేశించకుండా ఉండేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, కాని ఈ చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉందని, ఈ విషయమై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో నేరగాళ్లు పోటీ చేయకుండా నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, ఏఎం ఖావ్వికర్, డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని ‘ కోర్టులు లక్ష్మణ రేఖను దాటవు. చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుకు ఉంటుంది. తమ పరిధిని దాటి చట్టాలు రూపొందించే స్థానంలోకి కోర్టు అడుగుపెట్టదు. మేము చట్టాలు చేయం. ఈ పని పార్లమెంటుదే ’ అని కోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, ఈ అంశంపై చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుకు ఉంటుందని, పైగా ఒక వ్యక్తి దోషిగా ఖరారయ్యే వరకు నిర్దోషి అని గుర్తు చేశారు. ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడై ఉంటే ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వహించవచా అని కోర్టు ప్రశ్నించింది. ఆ వ్యక్తి రాజ్యాంగాన్ని పరిరక్షించగలరా అన కోర్టు అడిగింది. సీనియర్ న్యాయవాది, పిటిషన్ దాఖలు చేసిన సంస్త తరఫున న్యాయవాది దినేష్ ద్వివేది మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 34 శాతం మంది నేరస్తులు ఉన్నారని చెప్పారు. నేరమయ రాజకీయాల నిర్మూలనకు పార్లమెంటు చట్టం చేస్తుందనే నమ్మకం తమకు లేదన్నారు. కాగా ఈ కేసు విచారణను తొలుత ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించి రాజ్యాంగ ధర్మాసనానికి 2016 మార్చి 8న నివేదించింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ కూడా ఈ కేసులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంస్కరణలు తెచ్చే వి ధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా ఇటువంటి కేసుల్లో రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం దిగువు కోర్టులను ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉండే కేసుల విచారణను రోజూవారీ పద్ధతి లో విచారించాలని గతంలోనే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు కేసుల విచారణ జాప్యమైతే హైకోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.