క్రైమ్/లీగల్

కోమటిరెడ్డికి సుప్రీంలో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఒక వ్యక్తి చదవడానికి, ఉత్తీర్ణత పొందడానికి మధ్య తేడాపై సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. వెంకటరెడ్డి విద్యార్హతను సవాల్ చేస్తూ ఆయనపై పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, తదితరులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ఉమ్మడి హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. అంతేకాదు పిటిషనర్లకు జరిమానా కూడా విధించింది. హైకోర్టు తీర్పును భూపాల్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. భూపాల్ పిటిషన్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం ముందుకొచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హత తప్పుగా పేర్కొన్నారని పత్రికల్లోనూ ఆయన బీఈ చదివినట్లుగా ప్రచురితమైందని పిటిషనర్ తరఫున్యాయవాది బెంచ్ దృష్టికి తెచ్చారు. ఒక్క సబ్జెక్టు కూడా ఉత్తీర్ణత సాధించకుండా బీఈ చదివినట్లు డిక్లరేషన్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘ఎన్నికల ప్రమాణ పత్రంలో ఏం చదివారు? అని ఉంది కానీ విద్యార్హత ఏమిటీ? అని లేదుగా?’ అని ప్రశ్నించింది. కోమటిరెడ్డి ప్రమాణ పత్రంలో పేర్కొన్నది వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ ధర్మాసనం కొట్టివేసింది.
కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ 13కు వాయిదా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వ పునరుద్ధరణ వివాదంపై వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. శాసన సభ్యత్వాల బహిష్కరణ కేసులో ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేశామని, దీనిపై ఈనెల 16న విచారణ ఉన్నందునా ధిక్కరణ పిటిషన్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. వాయిదాకు నిరాకరించిన హైకోర్టు ఇప్పటికే చాల సమయం ఇచ్చామంటు అసెంబ్లీ సెక్రటరీకి, లా సెక్రటరీకి సోమవారం ఫామ్-1నోటీస్‌లు జారీ చేస్తామని చెప్పి అభ్యంతరాలుంటే సోమవారం తెలుపాలంటు కేసును సోమవారంకు వాయిదా వేశారు.