క్రైమ్/లీగల్

పరిస్థితి దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: నిరసన ప్రదర్శనల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట సవరణ చేసే వరకూ అనర్థాలను చూస్తూ ఊరుకోబోమని కేంద్రానికి స్పష్టం చేసింది. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. లేకపోతే, స్వయంగా మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అధ్యక్షతన, ఏఎం ఖన్వీల్కర్, డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రతి వారం, దేశంలో ఎక్కడో ఒక దగ్గర నిరసన ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయని పేర్కొంటూ, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలేమిటని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్టల్రో ఇటీవల జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు, పద్మావతి సినిమా విడుదలకు ముందు చోటు చేసుకున్న హింసను ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఒక వర్గానికి చెందిన వారు పద్మావతి సినిమా హీరోయిన్ ముక్కును కోసేస్తామని హెచ్చరికలు జారీ చేశారని పేర్కొంది. పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా దాడుల హెచ్చరికలు చేసిన వారిపై ఇంత వరకూ ఎఫ్‌ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదని నిలదీసింది. ఆ సమయంలో వేణుగోపాల్ స్పందిస్తూ, ఇలాంటి సంఘటనల్లో సంబంధిత అధికారులను జవాబుదారీ చేస్తున్నామని అన్నారు. ఉదాహరణకు ఢిల్లీలో అక్రమ కట్టడాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని స్పష్టం చేశామని అన్నారు. ఆ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఢిల్లీలో అక్రమ కట్టడాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనల్లో హింసకు తావులేకుండా చేసేందుకు ప్రస్తుత చట్టాలను సవరిస్తామని వేణుగోపాల్ చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ‘మీరు చట్టాలను సవరించే వరకూ ఏం జరుగుతున్నా చూస్తూ కోర్చోవాలా? అప్పటి వరకూ వేచి చూసే ప్రసక్తే లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలి’ పేర్కొంది. లేకపోతే, మార్గదర్శకాలను జారీ చేస్తామని హెచ్చరించింది.