క్రైమ్/లీగల్

మేజర్ల పెళ్లిలో జోక్యం చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: పరువు హత్యలపై సుప్రీం కోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమించుకున్న యువతీ యువకులు మేజర్లయతే, వాళ్ల పెళ్లిలో తలదూర్చే హక్కు ఏ వ్యక్తికీ, సమాజానికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులైనా, పంచాయితీ అయినా ఇంకెవరైనా ప్రేమికుల పెళ్లి విషయంలో జోక్యం చేసుకునే హక్కులేదని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విస్పష్టంగా ప్రకటించింది. వయోజనులైన జంటకు వివాహం చేసుకునే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. మేజర్లయిన జంట పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకోవడం వారి స్వేచ్ఛా హక్కు కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. తల్లిదండ్రులు, కుటుంబీకులు, పంచాయితీకి కూడా ఆ పెళ్లిని ఆపే హక్కు లేదని బెంచ్ పేర్కొంది. పరువు హత్యలకు సంబంధించి దాఖలైన పిటీషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. మేజర్లయిన యువతీ యువకుడు కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా ప్రాథమిక హక్కు కిందే వస్తుందని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. పరువు పేరుతో యువతీ యువకుల హత్యలు పెరిగిపోతున్నాయని పిటీషనర్, సామాజిక కార్యకర్త మధుకిష్వార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అంకిత్ సక్సేనా అనే యువకుడిని ప్రియురాలి తల్లిదండ్రులు దారణంగా హత్యచేశారని కిష్వార్ కోర్టు దృష్టికి తెచ్చారు. అయతే, ‘మేం దాని జోలికి వెళ్లబోం. అది మా దృష్టికి రాలేదు’ అని చీఫ్ జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. పరువు హత్యలకు కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని కిష్వార్ అభ్యర్థించారు. ఒక వ్యక్తి అని కాదు సమూహం లేదా పంచాయితీకి ఎవరికీ వధూవరులను వేధించే హక్కు లేదని మిశ్రా పునరుద్ఘాటించారు. పరువు హత్యలపై శక్తివాహినీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. పరువు హత్యలను ఆపడానికి మార్గదర్శకాలు సూచించాలని ప్రభుత్వానికి బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ తమకు మరింత సమయం కావాలని కోరారు.