క్రైమ్/లీగల్

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఛాంబర్ వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: జీహెచ్‌ఎంసీ ప్రైవేట్, ఔట్‌సోర్స్ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలు, మెరుగైన పాలన అంటూ ప్రవేశపెట్టిన సంస్కరణలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్స్ డ్రైవర్‌గా పనిచేసిన ఓ ఉద్యోగి సెలవు రోజైన శుక్రవారం కమిషనర్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా, అధికారుల్లో సంచలనాన్ని రేకెత్తించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్‌లో నివసించే సురేందర్ రెడ్డి జీహెచ్‌ఎంసీలో కొంత కాలం క్రితం వరకు ఔట్‌సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా జలగం వెంగళ్‌రావు పార్కులో విధులు నిర్వహించాడు. విధులు నిర్వహించినచోట వచ్చిన పలు ఆరోపణల కారణంగా అతన్ని మూడు నెలల క్రితం కాంట్రాక్టరు విధుల నుంచి తప్పించారు. తన తప్పేమీ లేదని మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు బాధితుడు పేర్కొన్నారడు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బీ ఆర్‌కే భవన్ ప్రవేశం గుండా సురేందర్ రెడ్డి బైక్‌పై అతివేగంగా దూసుకువచ్చాడు. సమయ స్పూర్తితో వ్యవహరించిన సెక్యూరిటీ గార్డులు వీరస్వామి, పురుషోత్తం, శ్రీనివాస్‌లు అతన్ని అడ్డుకున్నారు. కాని తాను బయటివాడిని కానని అక్కడ పార్కు చేసిన ఓ కారు చూపుతూ ఈ వాహనం డ్రైవర్‌నని వారిని నమ్మించాడు. సెలవురోజు పనేంటని గట్టిగా సెక్యూరిటీ సిబ్బంది నిలదీసేసరికి బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పిన సురేందర్ రెడ్డి ఒక్కసారిగా మొదటి అంతస్తులో ఉన్న కమిషనర్ ఛాంబర్ వరకు పరుగులు తీశాడు. అప్పటికే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతని వెంట పరుగులు తీసి ఛాంబర్ ఎంట్రన్స్ వద్ద పట్టుకున్నారు. అది సహించని సురేందర్ రెడ్డి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించే సరికి అక్కడికి చేరుకున్న సురేందర్ రెడ్డి కుమారుడు, భార్య, సెక్యూరిటీ గార్డులు అతన్ని అడ్డుకున్నారు. అగ్గిపెట్టె లాక్కొని అతన్ని తీసుకువచ్చి విజిలెన్స్ విభాగంలో అప్పగించారు. విజిలెన్స్ అధికారులు సురేందర్‌రెడ్డిని స్థానిక సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.