క్రైమ్/లీగల్

సబ్సిడీ గొర్రెలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, ఆగస్టు 17: తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన 47గొర్రెలను శుక్రవారం హుస్నాబాద్ వారసంతలో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రెండులక్షల 40వేల ఉంటుందని అధికారుల తెలిపారు. మల్లంపెల్లి పశువైద్యాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్‌ఐ సుధాకర్ సంతలో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను విచారించగా సబ్సిడీ గొర్రెలని తెలసింది. .హుస్నాబాద్ పట్టణానికి చెందిన కంసాలి రాజెందర్ 21 సం, కూరపాటి రమేశ్ అరెపల్లి, ఏకుల రాజయ్య, కేశవపట్నం గ్రామానికి చెందిన వ్యక్తులు కొంత మంది లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అంగట్లో అమ్ముతుండగా చెన్నురి సమ్మయ్య, హుస్నాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి 17 గొర్రెలు అమ్మినట్లు తెలిపాడు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతునట్లు సీఐ పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.