క్రైమ్/లీగల్

రావివలస సొసైటీ అక్రమాలపై విచారణకు హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 20: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) ద్వారా గరుగుబిల్లి మండలం రావివలస సొసైటీ బినామీ రుణాల వ్యవహారంపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. డిసిసిబి ద్వారా రావివలస సొసైటీకి 2012-13 కాలంలో రూ.3.83 కోట్ల మేరకు రుణాలు మంజూరయ్యాయి. ఈ రుణాలను బినామీ పేర్లతో స్వాహా చేశారన్న వ్యవహారంపై ఇప్పుడు హైకోర్టు నాలుగు నెలల వ్యవధిలో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. కాగా, రావివలస సొసైటీలో రైతుల పేరు చెబుతూ ఉద్యోగులకు, ఊరిలో లేని వారికి, బిచ్చగాళ్లకు, పిల్లలకు రుణాలు ఇచ్చినట్టుగా చూపించి కోట్ల రూపాయలు సొమ్ము పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. అన్ని డిసిసిబిలపై సీబీసీఐడి విచారణకు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. తరువాత ఆ నివేదికపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా పాలకవర్గం రద్దు కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. కాగా, ఈ సొసైటీ నుంచే తాజా మాజీ చైర్మన్ మరిశర్ల తులసీ ఎన్నిక కావడం గమనార్హం. అప్పట్లో బినామీ వ్యవహారాల పేరిట రూ.17 కోట్లు కైంకర్యం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తరువాత డిసిసిబి అధికారులు, సహకార శాఖ అధికారులు వీటిపై దర్యాప్తు నిర్వహించారు. వాటిలో చాలామేరకు రుణాలు వసూలు చేయడం, మిగిలిన రుణాలు సక్రమంగా ఉన్నాయని పేర్కొనడం జరిగింది. చివరకు రూ.3.83 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. కాగా, అప్పటి నుంచి దర్తాప్తులు జరిపినప్పటికీ ఆ నివేదికలను మాత్రం బహిర్గతం చేయలేదు.
ఇదే విషయమై డిసిసిబి సిఇఒ కె.జనార్దనను వివరణ అడగ్గా రావివలస సొసైటీలో అక్రమాలపై నాలుగు నెలల్లో నివేదికను అందజేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. ఈ సొసైటీకి డిప్యూటీ రిజిస్ట్రార్ నారాయణరావును విచారణాధికారిగా నియమించినట్టు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రావివలస అక్రమాల తేనెతుట్టె కదిలి నిజానిజాలు త్వరలోనే బహిర్గతం కానుంది.