క్రైమ్/లీగల్

సంజయ్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 20: లైంగిక వేధింపుల ఆరోపణలపై రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో కాలం వెళ్లదీస్తున్న డీఎస్ తనయుడు, నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు మరోమారు చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు సంజయ్‌కు కారాగార వాసం తప్పని పరిస్థితి నెలకొంది. శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు చేసిన ఫిర్యాదు మేరకు సంజయ్‌ను పోలీసులు ఈ నెల 12వ తేదీన అరె స్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించగా, ఆ మరుసటి రోజే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తరఫు న్యాయవాదులు జీవీ.కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేష్‌లు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానంలో పిటిషన్ సమర్పించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ క్లయింట్‌పై తప్పుడు ఆరోపణలతో నేరాభియోగాలు మోపారని, అతనికి తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని సంజయ్ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే రాజకీయ పలుకుబడి కలిగి ఉన్నందున సంజయ్‌కు బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశికిరణ్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలు 16వ తేదీ నాటికే పూర్తవగా, న్యాయమూర్తి తన నిర్ణయాన్ని 20వ తేదీ నాటికి వాయిదా వేశారు. ఈ మేరకు సోమవారం బెయిల్ పిటిషన్ విషయమై న్యాయమూర్తి స్పందిస్తూ కేసు నేర విచారణ దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయడం కుదరని పేర్కొం టూ సంజయ్ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.