క్రైమ్/లీగల్

శిథిలావస్థలో శ్రీశ్రీ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ ) విగ్రహం ట్యాంకు బండ్‌పై శిథిలావస్థలో ఉందని పేర్కొంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు సోమవారం నాడు పిల్‌గా స్వీకరించింది. ఈ వార్తపై తొలుత జస్టీస్ యు దుర్గాప్రసాద్ పేపర్‌లో వచ్చిన వార్తను ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తూ పిల్ కమిటీ ముందు ఉంచాలని కోరారు. దాంతో దానిని పిల్ కమిటీ ముందు ఉంచగా, ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించవచ్చని పిల్ కమిటీ పేర్కొంది.
హెచ్‌సీఏపై వాదనలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జి వివేకానంద వాదనలను సైతం వింటామని హైకోర్టు సోమవారం నాడు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టీస్ ఎస్వీభట్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
రోస్టర్ పాటించారా లేదా
మైనార్టీ గురుకులాల్లో టీచర్ల నియామకానికి సంబంధించి రోస్టర్ పాటించారా లేదా అంటూ హైకోర్టు ఇటీవల టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నోటీసులు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్ధులు తమ వాదనలను రెండు వారాల్లో వినిపించాలని పేర్కొంటూ జస్టీస్ పి నవీన్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.