క్రైమ్/లీగల్

అధిక ధరలకు విక్రయిస్తున్న మాల్స్‌పై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: జిఎస్‌టి తగ్గించినా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులపై తూనికల కొలతల శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. గ్రేటర్ పరిధిలో షాపింగ్ మాల్స్ యజమానులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలకు కసరత్తు చేస్తోంది. షాపింగ్ మాల్స్‌లో వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్నారని భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సంబంధిత శాఖ అధికారులు బృందాలుగా వివిధ మాల్స్‌పై దాడులు చేశాయి.
దాడుల్లో రత్నదీప్ సూపర్ మార్కెట్-18, హెరిటెజ్ సూపర్ మార్కెట్-13, మోర్ సూపర్ మార్కెట్-5,స్పెన్సర్-7, బిగ్‌బజార్-15, విజేత సూపర్ మార్కెట్, మహావీర ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పేయింట్ అండ్ హార్డ్‌వేర్, బిగ్‌సి, హైపర్ మార్కెట్‌లో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వాటిపై తూనికల కొలతల శాఖ అధికారులు దాడులు చేసి 125 మాల్స్‌పై కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ తెలిపారు.
తూనికలు కొలతల శాఖలో పదోన్నతులు
తూనికల కొలతల శాఖలో 16 మంది సిఐలకు పదోన్నతుల కల్పిస్తూ ఆశాఖ కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. 2012 నుంచి పదోన్నతులకు నోచుకోని సిఐలు డిఎల్‌ఎంఓలుగా పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన వారిలో బి. ప్రవీణ్ కుమార్, డి.శ్రీవల్లి, డి. సరోజ, మొహమ్మద్ సుజాత్ అలి, కె రామమోహన్, ఎన్. సంజయ్ క్రిష్ణ, బి. భూలక్ష్మీ, పి. శ్రీనివాసరెడ్డి, జి అశోక్‌బాబు, పి రవీందర్, ఎండి రియాజ్ అహ్మద్ ఖాన్, ఎంఎ జలీల్ ఉన్నారు.

చిత్రం..ఆకస్మిక తనిఖీలు జరుపుతున్న తూనికలు, కొలతల శాఖ అధికారులు