క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, అగస్టు 23: ఈసీ ఇచ్చేందుకు ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా అవుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కె.కిరణ్‌కుమార్‌రెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అవుకు మండలం గుండ్లసింగవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి ఈసీ, ఆర్‌హెచ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రూ. 10 వేలు లంచం ఇస్తేనే ఈసీ ఇస్తానని జూనియర్ అసిస్టెంట్ చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్‌రెడ్డికి రూ. 10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్‌పీ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు.