క్రైమ్/లీగల్

ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 23: ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీలో నివాసముండే రామచంద్రుడు అలియాస్ చంద్రయ్య యాదవ్, సుభాష్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సురేశ్‌రెడ్డి కలిసి మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులైన సాయిబాబా, మురళికృష్ణ సహాయంతో బుక్-1, వాల్యూమ్ 440లో 7 మాటిగేజ్ డాక్యుమెంట్‌లను తొలగించి ఆరు డాక్యుమెంట్‌లు నకిలీపత్రాలను సృష్టించి పొందుపరిచారు. ఒక డాక్యుమెంట్ బాచుపల్లి సర్వే 140, 141లోని 32 ఎకరాల స్థలానికి సంబంధించింది. నకిలీ పత్రాలు 1982లౌ కొనుగోలు చేసినట్లుగా సృష్టించారు. మిగతా ఐదు డాక్యుమెంట్‌లు సూరారం, గాజులరామారం గ్రామాలకి చెందిన భూములకు సంబంధించినవి. బాచుపల్లికి చెందిన 32 ఎకరాల స్థల యాజమాని దామోదర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఋరేశ్ రెడ్డి, సాయిబాబా, మురళీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా ప్రధాన నిందితుడు చంద్రయ్య యాదవ్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.
గొలుసు అపహరణ
కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 23 : ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును అపహరించుకపోయిన సంఘటన కేపీహెచ్‌బీకాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగోలు చెందిన కే.లక్ష్మీ (52) ప్రగతినగర్‌లోని బంధువులు ఇంటికి వచ్చి .. తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనంపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి ఆమె మెండలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కోని పరారయ్యారు. బాధితురాలు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను సీసీ పుటేజీల ఆధారంగా గుర్తించారు.