క్రైమ్/లీగల్

నా హక్కుల కాపాడండి: చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరచూ సమన్లు జారీచేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రాజకీయ కక్షసాధింపుతోనే తన నివాసంపైనా దాడులు జరిపారని శనివారం ఆయన ఆరోపించారు. తన ప్రాథమిక హక్కులను కాపాడాలని సీనియర్ న్యాయవాది చిదంబరం కోర్టును అభ్యర్థించారు. తన కుమారుడు కార్తీ చిదంబరంకు సంబంధం ఉందని చెబుతున్న ఎయిర్‌సెల్-మాక్సిస్, ఐఎన్‌ఎక్ మీడియా కేసులో తననూ లాగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు అందరూ సమానులు), 19 ( భావస్వేచ్ఛ), 21 (వ్యక్తిస్వేచ్ఛ) కింద తన గోప్యత హక్కును పరిరక్షించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. సీబీఐ, ఈడీ తీరువల్ల తన కుటుంబ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.