క్రైమ్/లీగల్

గుర్తు తెలియని శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, ఆగస్టు 28 : మండల పరిధిలోని చలమయ్యగారిపల్లి వద్ద పొలాల్లో గుర్తు తెలియని యువకుడు (20) శవం లభ్యమైనట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గ్రామ సమీపంలో శవం పడి ఉందని స్థానికులు సమాచారం అందివ్వగా ఎస్సై సుధాకర్ యాదవ్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారన్నారు. మృతదేహం తలపై కొట్టిచంపినట్లుగా తీవ్ర గాయమైందన్నారు. ఎక్కడో హత్య చేసి చలమయ్యగారిపల్లి వద్ద పడేసి మృతదేహంపై దుప్పటి కప్పి వెళ్ళిపోయారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.