క్రైమ్/లీగల్

కిడ్నాప్ కేసు సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: మహారాష్టక్రు చెందిన చిరు వ్యాపారిని కిడ్నాప్ చేసి మూడు రోజులు నిర్భందించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు ఛేదించి అరెస్ట్ చేశారు. మంగళవారం మావల పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేక ర్ల సమావేశంలో రూరల్ సిఐ ప్ర దీప్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. గత రెండు నెలల క్రి తం మహారాష్టల్రోని బోరి గ్రా మానికి చెందిన నగేష్, వినోద్‌లు ఆదిలాబాద్‌లోని కుమ్మరివాడకు చెందిన సంతోష్‌గౌడ్ నుండి వ్యాపారం పేరిట రూ.10లక్షల నగదును తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం ముంబైకి సంతోష్ గౌడ్‌ను తీసుకవెళ్ళి పలువురు వ్యక్తులతో మాట్లాడించినట్లు తెలిపారు. ఎంతకి సంతోష్‌కు రూ.10లక్షలు ఇవ్వకపోగా ఈ విషయమై నగేష్, వినోద్‌లను నిలదీయగా వారు రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తూ వచ్చారని అన్నారు. దీంతో విసుగు చెందిన సంతోష్ గౌడ్‌తో పాటు మిత్రులు గడ్డం కిష్టారెడ్డి, భీంరావు, షేక్ మోహిజ్, రాహుల్, అజయ్‌ల సాయంతో రెండు మోటారు సైకిళ్లు, రెండు ఫోర్‌విల్లర్ వాహనాలను తీసుకొని వినోద్ అన్న రామును ఈనెల 25న ఇంట్లో పూజ ఉందని నమ్మబలికి ఆదిలాబాద్‌కు రప్పించి కిడ్నాప్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సంధర్భంగా రామును ఆరుగురు నిందితులు చితకబాదుతూ ఆయన వద్ద నుండి సెల్ ఫోన్ తీసుకొని తమ్ముళ్ళు వినోద్, సుభాష్‌లకు ఫోన్లు చేసి రూ.40 లక్షలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రెండు రోజులుగా రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలమడుగు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత పోలీసులు మావల పోలీసుల సాయంతో 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. వీరిపై 365, 442, 446, 447, 506, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కిడ్నాపర్లు ఉపయోగించిన టిఎస్01ఈజె7056 ఎర్టిక, టిఎస్ 01ఈకె3961 స్విప్ట్ కారుతోపాటు టిఎస్01 ఈఎఫ్ 3644 ద్విచక్ర వాహనం, ఎంహెచ్ 29 డి 6848 అనే వాహనాలను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈకేసును ఛేదించిన వారిలో మావల ఎస్సై అనిల్, ఏఎస్సై శంకర్, పోలీసులు ప్రవీణ్, గజానంద్, సంతోష్, సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.