క్రైమ్/లీగల్

చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 28: రాచకొండ షీ టీం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆకస్మికంగా నిర్వహించిన డెకాయి ఆపరేషన్‌లో లింగ నిర్ధారణకు పాల్పడిన ఇద్దరు వైద్యులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ పట్టణంలోని రాజ్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగున్నాయని పోలీసులకు సమాచారం అందింది. రాచకొండ షీ టీం, అడిషనల్ డీసీపీ సలీమా, ఉప్పల్ వైద్యాధికారి డా.పల్లవి, ఎస్సై కృష్ణయ్య సిబ్బందితో ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో ఓ మహిళ నుంచి రూ.7500 తీసుకొని ఆసుపత్రి వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కడుపులో ఉన్న బిడ్డ మగ అని వివరాలను తెలిపారు.