క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ సునీల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, ఆగస్టు 30 : పెన్నానది బిడ్జ్రి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడి ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ సునీల్ (28) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెంగమనాయుడు కాలనీకి చెందిన సునీల్ ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో అనంతపురం వెళ్తున్న సునీల్ మందు వెళ్తున్న లారీని ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సునీల్ హెల్మెట్ ఉన్నప్పటికీ తలకు పెట్టుకోకపోవటం కారణంగా తలకు బలమైన గాయమై మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.