క్రైమ్/లీగల్

కోర్టులో లొంగిపోయిన వైకాపా నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఆగస్టు 30 : గత కొద్ది రోజుల క్రితం హిందూపురంలో రాజకీయ సర్వే నిర్వహిస్తున్న బృందం తమ పార్టీని అణగదొక్కే విధంగా వ్యవహరిస్తోందని వైకాపా నాయకులు నిరసన వ్యక్తం చేసి వారిని సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ ఇంటి వద్ద విచారించిన విషయం విదితమే. అయితే చట్టానికి వ్యతిరేకంగా సర్వే బృందాన్ని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేశారని స్థానిక పోలీసులు వైకాపా నేత నవీన్‌నిశ్చల్‌తోపాటు ఆ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆరుగురు అరెస్టు కాగా రెండు రోజుల క్రితం వారికి బెయిల్ కూడా మంజూరయింది. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న ఆరు మందికి పైగా నాయకులు గురువారం పోలీసుల కళ్లు గప్పి నేరుగా స్థానిక కోర్టులో లొంగిపోయారు. కౌన్సిలర్ ఆసీఫుల్లా, వైకాపా నాయకులు ప్రశాంత్‌గౌడ్, నరసింహారెడ్డి, చిరంజీవి, మరో ఇద్దరు కోర్టులో లొంగిపోగా న్యాయమూర్తి శారదారెడ్డి వచ్చే నెల 15వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ స్థానిక సబ్‌జైలుకు వైకాపా నాయకులను తరలించారు. ఇకపోతే నవీన్‌నిశ్చల్‌తోపాటు వైకాపా నాయకులు కోర్టులో లొంగిపోతారన్న సమాచారంతో గత నాలుగు రోజులుగా స్థానిక కోర్టు ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అయినప్పటికీ వైకాపా నాయకులు ఆరుగురు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కోర్టులో లొంగిపోవడం పోలీసు అధికారులను ఖంగుతినిపించింది. కాగా నియోజకవర్గ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు బృందాలుగా వీడి నవీన్ కోసం బెంగళూరు, హైదరాబాద్‌లో గాలింపు చేస్తున్నారు.