క్రైమ్/లీగల్

భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరి/చిన్నగొట్టిగల్లు, ఆగస్టు 30: టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది సినీ ఫక్కీలో ఎర్రచందనం లారీని, ఇద్దరు స్మగ్లర్లను గురువారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ తెలిపిన వివరాల మేరకు టాస్క్ఫోర్స్ బృందం పుత్తూరు మార్గంలో బుధవారం రాత్రి గస్తీ నిర్వహించారు. నారాయణ వనం వద్దలారీ లోడ్ చేసుకొని తమిళనాడువైపుగా ఎర్రచందనం లారీ వెళుతోందని తెలుసుకొని ఆ లారీని వెంబడించారు. పుత్తూరు వద్ద లారీని ఆపగా అదివేగంగా నగరి మార్గంలో వెళ్లింది. లారీని సినీ ఫక్కీలో చేజ్ చేసిన అధికారులు నగరి పోలీసులకు సమాచారం అందించి బైపాస్ కూడలి వద్ద అడ్డుకున్నారు. లారీకి నగరికి చెందిన సుబ్రమణి డ్రైవర్‌గా వ్యవహరించగా అతనితోపాటు కదిరికి చెందిన బాలవర్థన రెడ్డిని అరెస్ట్ చేశారు. లారీలోని మరో నలుగురు పరారయ్యారు. లారీలో 100 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వీటి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. సంఘటనా స్థలాన్ని టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్, ఏఎస్పీ లక్ష్మీనారాయణ పరిశీలించి చాకచక్యంగా వ్యవహరించి లారీని పట్టుకున్న ఇన్స్‌పెక్టర్ అశోక్‌కుమార్, ఎస్ ఐ సోమశేఖర్, లక్ష్మీపతి, ప్రసాద్ బృందాన్ని అభినందించారు. నగరి ఎస్ ఐ మునిస్వామి లారీని స్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేశారు.
ఇదిలావుండగా బాకరాపేట అటవీప్రాంతంలో బుధవారం రాత్రి అటవీశాఖాధికారులు, సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్‌చేసి వారి నుంచి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాధరెడ్డి గురువారం విలేఖరులకు తెలిపారు. డీఎఫ్‌ఓ నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు శ్యామలా సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో పడమర బీటు కుంభకోణం వద్ద కూంబింగ్ నిర్వహించామన్నారు. ఈ క్రమంలో ఐదుగురు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండటాన్ని గుర్తించి వారిని వెంటాడారన్నారు. అయితే తమ సిబ్బంది రాకను గమనించిన స్మగ్లర్లు పారిపోయారని, ఈ క్రమంలో తమ సిబ్బంది వారిని వెంటాడి ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారన్నారు. తక్కిన వారికోసం గాలింపుచర్యలు చేపడుతున్నామన్నారు. వారు వదిలివెళ్లిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎఫ్‌బీ ఓ లు తులసయ్య, శామ్యూల్, వందనకుమార్, ఇతర ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.