క్రైమ్/లీగల్

అట్టుడుకుతున్న కాట్రావులపల్లి దాడి కేసులో నిందితులు అరెస్టు: డీఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, ఆగస్టు 30: ఈనెల 25న జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి గ్రామంలో దళిత యువకుడు కాటే బాబిని అదే గ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు యువకులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచి పరారు కావడంతో అప్పటి నుంచి గ్రామం మొత్తం అట్టుడుకుతోంది. దాడిలో గాయాలపాలైన బాబి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దాడికి పాల్పడిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు యువకుల పేర్లతో జగ్గంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ వారిని అరెస్టు చేయడం లేదంటూ పలువురు దళిత సంఘాల నాయకులు కాట్రావులపల్లిలో ఆందోళనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ గురువారం నుంచి ముద్దాయిలను అరెస్టు చేయాలంటూ గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే ఒక రోజు ముందు నుంచే హర్షకుమార్‌ను రాజమహేంద్రవరంలోని పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఆయన తన నివాసంలో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ గ్రామంలో విచారణ నిర్వహించి ఈ ఘటనలో నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఉదయం జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీవీ రామారావు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాట్రావులపల్లిలో కాటే బాబిపై దాడికి పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారిని విచారిస్తామన్నారు. సమావేశంలో జగ్గంపేట సీఐ పి కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.