క్రైమ్/లీగల్

కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఆగస్టు 30 : కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 24వ తేదీన చీమకుర్తి మండలం ఏలూరు గ్రామానికి చెందిన ఓ బాలిక (14) కిడ్నాప్‌కు గురైంది. ఈ నెల 25వ తేదీన బాలిక తల్లిదండ్రులు ఒంగోలులోని రాష్టమ్రహిళా కమిషన్ సభ్యులు తమ్మిశెట్టి రమాదేవికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె వెంటనే చీమకుర్తి ఎస్‌ఐ చౌదరితో మాట్లాడి కేసును త్వరగా పరిష్కరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరగా స్పందించిన పోలీసులు బాలిక కిడ్నాప్ ఉదంతం నుంచి బాలికను రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. చీమకుర్తి మండలంలోని ఏలూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (23) అదే గ్రామానికి చెందిన బాలిక (14)తో సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నట్లు ఎస్‌ఐ విచారణలో వెల్లడైంది. వెంటనే బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు. గురువారం ఆ బాలికను మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి పరామర్శించి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. బాలికకు అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత ఇంటికి తీసుకెళ్లాలని వైద్యాధికారులు బాలిక తల్లిదండ్రులకు సూచించడంతో వారు ఒప్పుకోలేదు. ఆ బాలికను ఒంగోలులోని బాలసదన్‌కు తరలించారు. కిడ్నాప్ చేసిన బాలుడిపై పోక్సో యాక్ట్‌తోపాటు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.