క్రైమ్/లీగల్

పెళ్లింట విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఫిబ్రవరి 24: ఒడిశాలో ఓ పెళ్లింట పెనువిషాదం సంభవించింది. పెళ్లిలో వచ్చిన గిఫ్ట్ బాక్స్ తెరవగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దారుణ సంఘటలో వరుడు, అతడి నాయనమ్మ మరణించారు. ఒడిశాలోని బోలాన్‌గిరి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం యువతి, యువకుడికి పెళ్లయింది. ఈ నెల 21న వివాహ రిసెప్షన్ ఇంట్లో అందరూ ఉత్సాహంగా జరుపుకొన్నారు. అంతవరకూ బాగేనే ఉంది. రిసెప్షన్లో అతిథులు ఇచ్చిన కానుకలు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే ఓ గిఫ్ట్‌బాక్స్‌ను వధూవరులు తెరిచారు. అంతే అకస్మాత్తుగా గిఫ్ట్‌బాక్స్ పేలిపోయింది. దీంతో పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెతోపాటు అతడి బామ్మ తీవ్రంగా గాయపడ్డారు. వృద్ధురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. వరుడు రూర్కేలా ఇస్పాట్ జనరల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. వధువుకు బుర్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. సాక్ష్యాధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు పట్నాగఢ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి వెల్లడించారు.