క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 30: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గురువారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులతో పాటు జాతీయ రహదారిపై హోలిక్రాస్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారుకు నల్లద్దాలు ఉండడంతో పోలీసులు అనుమానంతో ఆపగా పోలీసులను చూసి ఆపకుండా వేగంగా దూసుకెళ్లింది. ఎస్సై తన సిబ్బందితో ఆ వాహనాన్ని వెంబడించడంతో చెన్నై వైపునున్న చెంగాళమ్మ ఆర్చి వద్ద ఆ కారుడ్రైవర్, మరో వ్యక్తి నిలిపివేసి పరారయ్యారు. పోలీసులు వాహనాన్ని పరిశీలించగా అందులో 6 పెద్ద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి అందులో ఉన్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. పట్టుబడిన వాహనాన్ని టాస్క్ఫోర్స్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది తొప్పాని వెంకటేశ్వర్లు, ఎఎస్సై కృష్ణ తదితరులు పాల్గొన్నారు.