క్రైమ్/లీగల్

సీయం సభలో అల్లర్లు సృష్టించిన యువకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) ఆగస్టు 30: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవర్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు స్పష్టం చేశారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి సభలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన 9 మంది యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. గురువారం అర్బన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సభలో అల్లర్లు సృష్టించడానికే వచ్చిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్ సయ్యద్ హబీబుల్లా, జూబేర్, బాషా, అహ్మద్, అబీద్, సల్మాన్‌జిక్రియ, ఇలియాజ్, ముక్తు, ముజా ఉద్దీన్ లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కేసును విచారిస్తున్న సమయంలో నిందితుల్లో ఒకరి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా పలు మేసెజ్‌లు కూడా వచ్చాయని ఆ కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులందరూ ఈనెల 27వ తేదిన కర్నూలు నుంచి రైలులో గుంటూరుకు వచ్చి 28 సాయంత్రం సీయం సభలో ప్రసంగిస్తున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి సభలో గందరగోళ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేఖ కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయరావు హెచ్చరించారు.

బైక్‌ను ఢీకొన్న ఆటో ఆరుగురుకి తీవ్రగాయాలు
సత్తెనపల్లి, ఆగస్టు 30: ముప్పాళ్ళ మండల పరిధిలోని ఇరుకుపాలెం గ్రామం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీ కొనడంతో ఆటోబోల్లాకొట్టి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముప్పాళ్ళ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఐదుగురు మహిళా డ్యాన్సర్లు నరసరావుపేట నుండి అచ్చంపేట ఆటోలో వెళుతుండగా సత్తెనపల్లి- నరసరావుపేట మార్గమధ్యలోగల ఇరుకుపాలెం సమీపంలో ఆటో బైకును ఢీకొని బొల్తాకొట్టింది. ఆటోలో ప్రయాణించే ఐదుగురు డ్యాన్సర్లకు తీవ్రగాయాలయ్యాయి. భైక్‌ను నడుపుతున్న వ్యక్తికి కాలు విరిగిపోయిందని పోలీసులు తెలిపారు. వీరిని హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుందని పోలీసులు తెలిపారు.