క్రైమ్/లీగల్

చిన్న పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) అగస్టు 30: రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులే వారి టార్గెట్... ఏమీ తెలియని అమాయకుల్లా బైక్‌లపై తిరుగుతూ చిన్న పిల్లలను అపహరిస్తారు. అనంతంరం వారిని చిత్ర హింసలకు గురిచేసి వారిచేత బలవంతంగా భిక్షాటనతోపాటు, వారిని పలు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్న ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించే క్రమంలో కిడ్నాప్ చేసే ముఠానే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పిల్లలను అపహరిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే కిడ్నాప్ అయిన బాలుడితో పాటు మరో ఐదుగురు చిన్నారులను రక్షించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారిని గురువారం మీడియా ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా వివరాలను అయన వెల్లడించారు. గత నెల 28న పొన్నూరు రూరల్ మండల పరిధిలోని ఇంటూరు గ్రామంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు నక్కా శామ్యూల్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు అపహరించి తీసుకువెళ్లారు. ఆ కేసును విచారిస్తున్న సమయంలో అనేక విషయాలను పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో కేసు విచారణ నిమిత్తం అందిన సమాచారం మేరకు తెనాలి డియస్పీ స్నేహిత ఈ నెల 29న తెనాలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ ముఠా సమాచారం అందింది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరికి చెందిన దానయ్య కీలక పాత్రధారిగా ఉంటూ తూర్పుగోదావరితో పాటు, పశ్చిమగోదావరికి చెందిన మరో ఐదుగురు ముత్యాలు, సనతా, ఏడుకోండలు, కొండయ్య, లక్ష్మిలు ముఠాగా ఎర్పడి చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి, వారిని భిక్షాటనకు వినియోగిస్తున్నరని విచారణలో తేలిందని ఆయన తెలిపారు. ఇంటూరులో కిడ్నాప్‌కు గురైన బాలుడుతో పాటు మరో అరుగుగు పిల్లలను పోలీసులు వారి చెర నుంచి విముక్తి కల్పించారు. పిల్లలను సిడబ్ల్యుసి చైర్మన్ ముందు త్వరలో ప్రవేశ పెడతామని ఆయన తెలిపారు. నిందితులందరిపై గతంలో అనేక దొంగతనాలతోపాటు, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి 5 లక్షల 50 వేల రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి డియస్పీ స్నేహిత, సిఐ రమేష్, ఎస్‌ఐ క్రాంతికిరణ్‌లను ఆయన అభినందిచారు. నిందితులను రిమాండ్‌కు పంపించారు.