క్రైమ్/లీగల్

రాయలవర్గం సీపీఐఎంఎల్ గూడూరు డివిజన్ సెక్రటరీ పుల్లన్న అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఆగస్టు 30: సీపీఐ ఎంఎల్ రాయలవర్గం గూడూరు డివిజన్ కార్యదర్శి సంపెంగి ముత్తయ్య అలియాస్ పుల్లన్నతోపాటు అతని గన్‌మెన్ నల్లమూరి అశోక్‌ను పోలీసులు అరెస్ట్‌చేసినట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపా రు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గూడూరు డివిజన్ కార్యదర్శి పుల్లన్న అతని గన్‌మెన్ అశోక్‌లు గురువారం ఉదయం సుమారు 10గంటల ప్రాంతంలో గంగారం మండలంలోని పెద్దాపూర్‌కు
వెళ్తున్నట్లు సమాచారం రావడంతో గూడూరు సీఐ రమేష్, గంగారం ఎస్సై భద్రునాయక్ వారి సిబ్బందితో పెద్ద ఎల్లాపూర్ రోడ్డులో మాటువేసి అరెస్ట్‌చేశారు. హిరో గ్లామర్ మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న వారి వద్ద నుండి 9ఎంఎం కార్బన్ తుపాకి, 2.9ఎంఎం కార్బన్ మ్యాగ్జిన్స్, 25తుటాలు, 50 ఎస్‌ఎల్‌ఆర్ స్వాదీనం చేసుకున్నారు. అశోక్‌బ్యాగులో పిస్టల్, తుటాను స్వాదీనం చేసుకున్నారు. పుల్లన్న 1990 నుండి 97వరకు పిడిఎస్‌యు లీడర్‌గా బయ్యారం మండలంలో పనిచేశారు. 1997 నుండి ఇప్పటివరకు దళ సభ్యుడి స్థాయి నుండి దళ కమాండర్‌గా దళానికి మండల కార్యదర్శిగా, డివిజన్ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇతనిపై అనేక బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులతోపాటు మడ్డర్ కేసులు ఉన్నాయి. మూడు జిల్లాలో 10కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇతనితోపాటు అరెస్ట్ అయిన అశోక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం నివాసి. ఇతను సీపీఐ లీగల్ క్యాడర్‌లో పనిచేస్తూ పాకాల, కొత్తగూడెం సూర్యం దళంలో దళసభ్యునిగా చేరారు. వీరిద్దరిని అరెస్ట్‌చేసి స్వాదీనం చేసుకున్న ఆయుధాలను ఎస్పీ విలేఖరుల ఎదుట ప్రదర్శించారు. ధైర్య సహసాలతో పట్టుకున్న గూడూరు సీఐ రమేష్, గంగారం ఎస్సై భద్రునాయక్ వారి సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈవిలేఖరుల సమావేశంలో మానుకోట డీఎస్పీ నరేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.