క్రైమ్/లీగల్

విదేశీ మాదక ద్రవ్యాల విక్రేత అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 30: విదేశీ మాదక ద్రవ్యాలను(డ్రగ్స్) దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న ఓ పాత నేరస్థుడిని అరెస్టు చేసి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఘట్‌కేసర్ ఎక్సైజ్ ఇన్స్‌స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని కాప్రా పరిధి కమలానగర్‌లో నివాసం ఉంటున్న నూక నవ్యంత్(24) గత నాలుగు సంవత్సరాలుగా నెదర్లాండ్ దేశం నుంచి ఆన్‌లైన్‌లో విదేశి మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాప్రా పరిధిలో రాధిక థియేటర్ సమీపంలోని బకాసుర రెస్టారెంట్ వద్ద రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సుపరిండెంట్ కే.పవన్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ద్విచక్రవాహనంలో మాదకద్రవ్యాలను విక్రయించేందుకు వెళ్లుచున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో విదేశి మాదక ద్రవ్యాలు ఉన్నట్లు చెప్పారు. ఎల్‌ఎస్‌డీ బ్లోట్స్ 15 పాకెట్లు, రెండు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థం, 20 గ్రాముల గంజాయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్క ఎల్‌ఎస్‌డీ బ్లోట్స్ పాకెట్‌ను రూ. 2000, ఒక్క ఎండీఎంఏ పాకెట్‌ను రూ.4000లకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నెదర్లాండ్‌కు చెందిన డీలర్ నుంచి ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకుని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తు గతంలో పట్టుబడి రెండు సార్లు జైలుకు వెళ్లివచ్చిన తర్వాత మళ్లి అదే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడి వినియోగించిన ద్విచక్రవాహనం, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తనిఖీలు నిర్వహించిన వారిలో రాష్ట్ర టాస్క్‌పోర్స్ ఎక్సైజ్ ఇన్స్‌స్పెక్టర్ బీ.ప్రవీన్‌కుమార్, ఎస్సైలు సుభాస్‌చందర్, అక్రం అలీ, హెడ్‌కానిస్టేబుల్లు శివకుమార్‌రెడ్డి, రమేశ్, విజయ్‌కృష్ణ ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్‌కేసర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.