క్రైమ్/లీగల్

ఓరియంటల్ బ్యాంకులో రూ.389కోట్ల కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణంతో దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఒడుదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో మరో ప్రభుత్వరంగ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో (ఓబీసీ) మరో కుంభకోణం వెలుగు చూసింది. ఢిల్లీ కేంద్రంగా వజ్రాల ఎగుమతి వ్యాపారం చేసే ద్వారకాదాస్ సేథ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. దాదాపు రూ.389.85 కోట్ల రుణానికి సంబంధించి అతడు మోసానికి పాల్పడ్డట్టు ఓబీసీ ఆరునెలల క్రితం ఫిర్యాదు చేయగా ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసింది. ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని, ఆ సంస్థకు చెందిన డైరక్టర్లు సభ్యాసేథ్, రీటా సేథ్, కృష్ణకుమార్ సింగ్, రవి సింగ్‌లతోపాటు ద్వారకాదాస్ సేథ్ ఎస్‌ఈజెడ్ ఇన్‌కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. ఓబీసీ నుంచి 2007-12 సంవత్సరాల మధ్య ఆయా సంస్థలు, పైన పేర్కొన్న వ్యక్తులు దాదాపు రూ.389 కోట్ల రుణాలు తీసుకున్నారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ లేఖలను ఉపయోగించి విదేశాల్లో చెల్లింపుల పేరుతో భారీగా బంగారం, వజ్రాలు, నిధులు మళ్లించారని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదని ఓబీసీ సీబీఐకు ఫిర్యాదు చేసింది. డొల్ల కంపెనీల పేరుతో వీరంతా లావాదేవీలు నిర్వహించారని కూడా ఓబీసీ ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.