క్రైమ్/లీగల్

కట్న వేధింపుల కేసులో ముద్దాయికి రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 30: అదనపుకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తపై నేరం రుజువుకావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.200ల జరిమానా విధిస్తూ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ తరచూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ భవానీపురం హరిజనవాడకు చెందిన కోలంటి మేరి తన భర్త ప్రకాశరావుపై 2011 నవంబర్ 9న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితుడు ప్రకాశరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులను విచారించిన మీదట నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.