క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, ఆగస్టు 31:మండల పరిధిలోని గోరంట్ల గ్రామంలో శుక్రవారం రైతు బోయ రంగన్న(32) అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతు కుటుంబానికి ఈ ఏడాది నెలకొన్న కరవు పరిస్థితులతో సాగు చేసిన పంటలు చేతికి రాలేదు. దీంతో ఏటా పంటల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. సొంతంగా ఉన్న ఎకరా పొలంతో పాటు మరో 5 ఎకరాలు భూమిని కౌలుకి తీసుకుని పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఏటా అప్పులు తెచ్చి పంటలు సాగు చేసుకుంటూ వస్తున్నా ఏనాడు ఆశించిన దిగుబడులు రాలేదు. ఈ ఏడాది కూడా ఉల్లి, పత్తి పంటలు సాగు చేయగా వర్షం కురవకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రంగన్న ఉదయం పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కోడుమూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.