క్రైమ్/లీగల్

విద్యార్థులపైకి దూసుకెళ్లిన బొలేరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌పూర్ (బిహార్), ఫిబ్రవరి 24: బొలేరో వాహనం రూపంతో మృత్యువు తొమ్మిది మంది విద్యార్థులను కబళించింది. మీనాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న బొలేరో అదుపుతప్పి ప్రభుత్వ పాఠశాల వైపుదూసుకొచ్చింది. ఏకంగా విద్యార్థులపై నుంచి వాహనం వెళ్లిపోవడంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పాఠశాల ముగించుకున్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు వేచివుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇరవై మంది విద్యార్థులు గాయపడ్డారని ముజఫర్‌పూర్ ఎస్పీ వివేక్ కుమార్ వెల్లడించారు. ‘మీనాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అహియాపూర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బడి అయిపోయాక ఇళ్లకు వెళ్లడానికి పిల్లలంతా వేచి ఉన్నారు. ఈలోగా ఆకస్మాత్తుగా బొలేరో వాహనం పాఠశాల వైపు దూసుకొచ్చింది. అక్కడున్న విద్యార్థుపై నుంచి వాహనం వెళ్లిపోయింది’ అని ఆయన తెలిపారు. గాయపడ్డ విద్యార్థులందరినీ శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరించామని ఆయన చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వివేక్ కుమార్ పేర్కొన్నారు. డ్రైవర్ తాగి వాహనం నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని మీనాపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే మున్నా యాదవ్ ఆరోపించారు.

చిత్రం..తొమ్మిది మంది పిల్లల మృతికి కారణమైన బొలేరో వాహనం