క్రైమ్/లీగల్

ప్రైవేట్ బ్యాంకుకు రూ. 2 కోట్లకు టోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప క్రైం, ఫిబ్రవరి 24: బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసిన బడాబాబులకు తానేమీ తీసిపోనని అంటున్నాడు కడప జిల్లాకు చెందిన అబ్దుల్ గఫార్. కూలీల పేర రూ. 2 కోట్ల మేరకు రుణం తీసుకుని ఓ ప్రైవేటు బ్యాంకుకు నామం పెట్టిన గఫార్ చివరకు కటకటాలపాలయ్యాడు. బ్యాంకుకు పోటీ పెట్టిన గఫార్ వివరాలు డీఎస్పీ మాసూంబాషా శనివారం విలేఖరులకు వెల్లడించారు. కడపకు చెందిన అబ్దుల్ గఫార్ మరో ఐదుగురి సహకారంతో ఓ ప్రైవేటు బ్యాంకుకు బ్యాంకుకు టోపీ పెట్టాడు. వే టు వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు పలువురిని నమ్మించిన గఫార్ తమ కంపెనీ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని, అయితే రూ.లక్షకు రూ.20వేలు కమీషన్ ఇవ్వాలని ప్రచారం చేసుకున్నాడు. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా రుణం ఇప్పిస్తామని, తిరిగి కట్టాల్సిన అవసరం కూడా లేదని కూలీ పనులు చేసుకునేవారిని బోల్తా కొట్టించాడు. ఇలా 42 మందిని కూడగట్టి వారు తన ‘వే టు వెల్త్’ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు వారి పేర నకిలీ పే స్లిప్పులు, నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు సృష్టించాడు. వీటిని ఒక ప్రైవేట్ బ్యాంకు అధికారులకు చూపించి తమ సంస్థ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని లాబీయింగ్ చేశాడు. వీరందరి పేర ఆ బ్యాంకు నుంచి రూ.1.95 కోట్ల రుణం మంజూరు చేయించి రూ.20 శాతం కమీషన్ తీసుకున్నాడు. అయితే రుణం తీసుకున్నవారు ఎంతకూ కంతులు చెల్లించకపోవడంతో అబ్దుల్ గఫార్‌పై వత్తిడి తెచ్చిన బ్యాంకు అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అబ్దుల్ గఫార్‌ను అరెస్టు చేయడంతో అసలు బండారం బయటపడింది. ఇతనికి ఏజెంట్లుగా వ్యవహరించిన ఆంథోనిబాబు, మహబూబ్ బాషాతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది హరి, బాలయ్య, రాజశేఖర్‌ను శుక్రవారం బిల్టప్ వద్ద అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. బ్యాంకు పేరు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.