క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఫిబ్రవరి 25 : మండల పరిధిలోని కాలువపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందూపురం పట్టణంలోని ఎస్‌డీజీఎస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రవితేజ (19) మృతి చెందాడు. రవితేజ కాలువపల్లి వద్ద ఓ బంక్‌లో పెట్రోలు వేయించుకుని పరిగి వైపు వెళ్తుండగా హిందూపురం నుండి మడకశిర వైపునకు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అలాగే కళాశాల ప్రిన్సిపాళ్లు శ్రీనివాసులు, నాగేంద్రకుమార్ తదితర అధ్యాపకులు రవితేజ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సంతాపంగా సోమవారం కళాశాలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 25 : మండల కేంద్రంలోని అనంతపురం-తాడిపత్రి రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెరుకూరి ఆదెప్ప (56) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ఆదెప్ప వ్యవసాయంతోపాటు గొర్రెలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే తనకున్న గొర్రెలు జిల్లా జైలు సమీపంలో ఉండటంతో కాపరికి అన్నం ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కెనాల్ వద్దకు రాగానే పెట్రోలు అయిపోయింది. పక్కనే తోటలో ఉన్న మరో వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.