క్రైమ్/లీగల్

ఆరుగురు ఐసిస్ ఉగ్రవాదులపై చార్జిషీటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దక్షిణ భారత ప్రాంతంలో పలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు యువ ఐసిస్ ఉగ్రవాదులపై కేరళలోని ఎన్‌ఐఏ కోర్టు చార్జిషీటు నమోదు చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న కొందరు యువకులు కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రణాళిక వేశారని, నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ 2016 అక్టోబర్ ఒకటిన కేసు నమోదు చేసింది. అన్సరుల్ ఖలీఫా-కెఎల్ పేరుతో వీరు సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు సంభాషించుకుంటూ కొందరు ముఖ్యులపై పై దాడులు చేయడానికి పథకాలు వేశారు. వీరి టార్గెట్‌లో జడ్జిలు, పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, విదేశీయులు, హేతువాదులు ఉన్నారు. ఈ గ్రూపునకు చెందిన ఆరుగురు సభ్యులు 2016, అక్టోబర్ రెండున కేరళలోని కన్నురు జిల్లాలోని కనకమాలలలో సమావేశం నిర్వహిస్తుండగా ఎన్‌ఐఏ పట్టుకుంది. తర్వాత గత ఏడాది ఫిబ్రవరి 15న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఐసిస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుభాని హజామొయిద్దీన్‌ను సైతం అరెస్ట్ చేసింది. తర్వాత ఎన్‌ఐఏ మన్‌సీద్ మహమ్మద్, స్వాలి మహ్మద్, రషీద్ అలీ, రమ్‌షద్ ఎన్‌కె, సఫ్‌వన్, జాసిన్ ఎన్‌కె, షాజీర్‌లపై వివిధ సెక్షన్ల కింద చార్జిషీటు నమోదు చేసింది. కాగా, సోమవారం ఎర్నాకుళంలోని ఎన్‌ఐఏ స్పెషల్‌కోర్టులో వీరిపై చార్జిషీటు నమోదు చేశారు. ఈ కేసును గురువారానికి వాయిదా వేశారు. కాగా, దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.